పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

సమస్యలను తెలుసుకుంటున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

  • ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్‌ డేను నిర్వహించారు. జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లు, ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలపై ఎస్‌పికి విన్నవించారు. బదిలీలు, సీనియార్టీ ప్రమోషన్స్‌, సరెండరు లీవ్స్‌ మంజూరు, ఇన్‌కమ్‌ టాక్స్‌ రికవరీ, ఆరోగ్య పరమైన సమస్యలు వంటి వాటిపై వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను కూలంకషంగా విన్న ఎస్‌పి, తగిన పరిష్కారం చూపుతానని భరోసా కల్పించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత జిల్లా పోలీస్‌ కార్యాలయ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

➡️