సినీ ఫక్కీలో చోరీ

పట్టణంలోని దాసన్నపేట

దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ సత్యనారాయణ

* స్కూటీ డిక్కీలో నుంచి రూ.3.50 లక్షలు అపహరణ

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

పట్టణంలోని దాసన్నపేట వద్ద సినీ ఫక్కీలో బుధవారం చోరీ జరిగింది. స్కూటీ డిక్కీలోని రూ.3.50 లక్షలు గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వివరాల్లోకి వెళ్తే… దాసన్నపేటలో నివాసం ఉంటున్న సింగంశెట్టి శ్రీను బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటి పక్కనే ఉన్న యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో రూ.3.50 లక్షల నగదును విత్‌ డ్రా చేసి చేసి, తన స్కూటీలోని డిక్కీలో పెట్టి తాళం వేశాడు. తన షాపునకు వెళ్లి అక్కడ స్కూటీని పార్కింగ్‌ చేశాడు. షాపులో బ్యాగులు తీసుకుని పది నిమిషాల తర్వాత స్కూటీ వద్దకు వచ్చేసరికి డిక్కీ తెరిచి ఉంది. అందులో పెట్టిన నగదు లేకపోవడంతో, లబోదిబోమంటూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి పరిసరాలను పరిశీలించారు. అనంతరం సమీపంలోని సిసి కెమెరాను పరిశీలించారు. బైక్‌పై ఒక బాలుడు వచ్చి స్కూటీ డిక్కీని ఓపెన్‌ చేసి నగదును అపహరించినట్లు రికార్డు అయింది. ఆ నగదుతో బాలుడు ఒడిశా వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టారు.

➡️