పులి పాదాలను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారి పోలయ్య
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు
మండలంలోని తీరప్రాంత గామాలైన మెట్టూరు, ఒంటలూరు చీపురుపల్లి గ్రామాల రహదారుల్లో పులి అడుగు జాడలు కనిపించాయి. పెద్ద పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న పలాస అటవీశాఖాధికారి పోలయ్య శనివారం సాయంత్రం పులి పాదాలను పరిశీలించారు. ఇవి పులి అడుగులు కావని, పెద్ద నక్క అడుగులు అయి ఉంటాయని చెప్పారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేపట్టి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా, పులి అడుగుజాడలు కనిపించాయంటూ ప్రచారం కావడంతో యువత అడుగులను చూసేందకు ఎగపడ్డారు.