రిమాండ్‌ ఖైదీలకు సకాలంలో న్యాయం

జిల్లా వ్యాప్తంగా

మాట్లాడుతున్న జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లా వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న రిమాండ్‌ ఖైదీలకు సత్వర న్యాయం చూకూర్చడానికి వీలుగా ఛార్జిషీట్లు దాఖలు చేసి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో గురువారం పోలీసు, జైలు, పబ్లిక్‌ ప్య్రాసిక్యూటర్లు, జిపి, స్టాట్యూటరీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘ కాలంగా జైళ్లలో ఉంటున్న వారికి న్యాయ సహాయం అందించేందుకు వీలుగా న్యాయసేవాధికార సంస్థ తోడ్పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయాలు ఖర్చులు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వి.ఎల్‌.హిమబిందు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️