రాష్ట్రస్థాయి ఉత్తమ పరిశోధనా కేంద్రంగా రాగోలు

ఆచార్య ఎన్‌.జి రంగా

అవార్డు అందుకుంటున్న శాస్త్రవేత్తలు

  • వరి రకాలు, అపరాల విత్తనోత్పత్తి రూపకల్పనలో అగ్రస్థానం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఆచార్య ఎన్‌.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం పరిధిలోని రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ వ్యవసాయ పరిశోధనా స్థానంగా 2023 సంవత్సరానికి గానూ అవార్డు లభించింది. రాగోలు వ్యవసాయ స్థానంలో వరి రకాల రూపకల్పనలో చేపట్టిన విస్తృత పరిశోధనలు, వరి, మినుము, పెసరలో బ్రీడర్‌ సీడ్‌ విత్తనోత్పత్తి, జన్యు స్వచ్ఛత కలిగిన వరి విత్తనోత్పత్తి సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. దీనికితోడు రైతులకు సాంకేతికపరమైన సేవలందిం చడంలోనూ అగ్రభాగాన నిలిచింది. గుంటూరు లాంఫారంలో 58వ ఆర్‌ఇఎసి సమావేశాలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.ఢిల్లీరావు, ఆచార్య ఎన్‌.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ ఆర్‌.శారదా జయలకీëదేవి చేతుల మీదుగా ఈ అవార్డును బుధవారం అందజేశారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్‌ పి.వి సత్యనారాయణ, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.ఉదయబాబు, కె.మధుకుమార్‌ అందుకున్నారు.

➡️