హడావుడిగా ‘నాడు-నేడు’ పనులు

పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల

పాఠశాలలో చేపడుతున్న రోడ్డు పనులు

  • హెచ్‌ఎంపై ఎంఇఒ ఫిర్యాదు

ప్రజాశక్తి – పొందూరు

పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హడావుడిగా నాడు-నేడు పనులు చేపడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో నాడు-నేడు పనులు నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ పాఠశాలలో గతంలో పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బిల్లులు చెల్లించారన్న ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వెంకటరావు రెండు రోజులుగా చేపట్టని పనులను పూర్తి చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంఇఒ-2 పట్నాన రాజారావు పనులు నిలిపివేయాలని ఆదేశించినా, పాఠశాలలో రోడ్డు పనులు, భవనానికి సున్నం వేయడం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా పనులు కొనసాగడంతో దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంఇఒ-2 రాజావరావు తెలిపారు.

➡️