గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Nov 28,2024 12:46 #Srikakulam district.

 100% రాయితీతో చేప పిల్లల పంపిణీ
 చెరువులో విడిచిపెట్టిన ఎమ్మెల్యే కూన రవికుమార్
ప్రజాశక్తి-బూర్జ : గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తమ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. అయినా గురువారం నాడు మండలంలోని వైకుంటపురం పంచాయతీ పరిధిలోని ఉన్న అల్లేపల్లి గూడ గిరిజన గ్రామంలో సందర్శించారు. గిరిజనలు అన్ని రంగాలను అభివృద్ధి చెందేందుకు వీలుగా ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న చెరువులలో చేప పిల్లలను పెంచేందుకు రాయితీతో చాప పిల్లలను అందజేస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉన్న ఆరు చెరువులకు సంబంధించి 32వేల చేప పిల్లలను అందజేశారు అనంతరం ఆయన చెరువులలో చేప పిల్లలను విడిచిపెట్టారు. గిరిజనులు తమ వంతు బాధ్యతగా చేప పిల్లలను పెంచి తద్వారా విక్రయించుకుని ఆర్థికంగా నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పీరు కట్ల, విశ్వ ప్రసాద్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ, గ్రామ సర్పంచ్ బి సత్యం, మాజీ సర్పంచ్ ఎం సత్యంతో పాటు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️