ఠాగూర్‌కి నివాళి

స్థానిక శాంతినికేతన్‌ హైస్కూల్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వర్థంతి వేడుకలను

చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

స్థానిక శాంతినికేతన్‌ హైస్కూల్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వర్థంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ముందుగా స్కూల్‌ చైర్మన్‌ డి.కృష్ణమూర్తిరెడ్డి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కవి అయిన ఠాగూర్‌ 1913లో గీతాంజలి రచనకు నోబెల్‌ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారని అన్నారు. భారత జాతీయ గీతం జనగణమణ కూడా ఠాగూర్‌ రచించినదేని అన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ మేనేజర్‌ కె.సి.పూరి, ఉపాధ్యాయులు సురేఖ పట్నాయక్‌, పద్మజ, తనూజ, ఇంటరాక్ట్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ తెజేష్‌, సెక్రటరీ డి.హర్షవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

 

➡️