మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు ‘ఉల్లాస్‌’

మహిళల అక్షరాస్యతను

మాట్లాడుతున్న జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మహిళల అక్షరాస్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్‌ రాజు తెలిపారు. జిల్లాస్థాయి ఉల్లాస్‌ శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఉల్లాస్‌ కార్యక్రమంపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. వయోజన విద్యాశాఖ డీడీ ముద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ అక్షరాస్యతలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు ‘ఉల్లాస్‌’ దోహదపడుతుందన్నారు. శిక్షణకు పొదుపు సంఘాల్లో మహిళలు, పాఠశాలల్లో పనిచేసే సహాయకులు, వంట పనివారు, ఆయాలు, అంగన్వాడీ కేంద్రాల సహాయకుల్లో నిరక్షరాస్యులను గుర్తించినట్లు చెప్పారు. వీరికి నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతి పది మందికి ఓ సహాయకుడిని నియమిస్తారని తెలిపారు. ఫంక్షనల్‌, డిజిటల్‌, ఆర్థిక అక్షరాస్యతపై అభ్యసన ఉంటుందన్నారు. డిఆర్‌డిఎ, ఐసిడిఎస్‌, డిపిఒ, గ్రామ, వార్డు సచివాలయం, డిఐపిఆర్‌ఒ, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ఎపిఒ బాలచందర్‌ పాల్గొన్నారు.

➡️