తనిఖీలు చేస్తున్న ఎసిబి అధికారులు
భారీగా ఆస్తులు కూడబెట్టిన మాజీ డిప్యూటీ సిఎం పిఎ మురళి
అధికారిక లెక్కల ప్రకారం రూ.మూడు కోట్లు
కేజీన్నర బంగారం, 11 కేజీల వెండి స్వాధీనం
అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్న అధికారులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ పిఎ గొండు మురళి భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. జలుమూరు మండలం బుడితి సిహెచ్‌సిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్న ఆయన భారీగా ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. ఎసిబి డిజిపి సూచనలతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు చేశారు. ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం…జలుమూరు మండలం బుడితి సిహెచ్‌సిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న గొండు మురళి వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద 2019 నుంచి 2022 వరకు వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. మంత్రి పిఎగా పనిచేస్తున్న రోజుల్లోనే ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతని ఆక్రమ ఆస్తులపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించిన అధికారులు గురువారం జిల్లాలో నాలుగు చోట్ల, విశాఖలో రెండు చోట్ల దాడులు చేశారు. జిల్లాకు సంబంధించి కోటబొమ్మాళి మండలం లోని ఆయన సొంత గ్రామం దంతలోని ఆయన నివాసంతో పాటు అతని మామ నివాసం, బుడితి సిహెచ్‌సి, లింగన్నాయుడు పటలోని ఆయన సోదరుడి నివాసంలో దాడు లు చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం నగరం లోని తన ఇంటితో పాటు విశాఖలోని గాజుy ాక ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తుల చిట్టాశ్రీకాకుళం, గాజువాక, కోటబొమ్మాళిల్లో చెరో ఒక ఇళ్లు, దంత గ్రామంలో మూడు ఇళ్లు, మధురవాడలో ప్లాట్, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ఇళ్ల స్థలాలు, విశాఖలోని పెందుర్తిలో ఒక ఇంటి స్థలం, విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక ఇల్లు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 15.47 ఎకరాల వ్యవసాయ భూమి, 6.05 ఎకరాల మెట్టు ఉన్నట్లు గుర్తించారు. ఇంటిలో 520 గ్రామలు, లాకర్‌లో 536 గ్రాముల బంగారం దొరికింది. దీంతో పాటు 11.36 కేజీల వెండి దొరికింది. బ్యాంకు ఖాతాలో రూ.43,223 రూపాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక మారుతి కారు, ఒక బుల్లెట్ మోటారు సైకిల్ ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువగా రూ.3 కోట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మార్కెట్‌లో వీటన్నింటి విలువ రూ.50 కోట్లపైనే ఉండొచ్చనే అంచనా గా ఉంది. నిందితుడు మురళిపై క్రైమ్ నంబరు 169/2024 పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఆంధ్రా రీజియన్ ఎసిబి జాయింట్ డైరెక్టర్ ఎం.రజని, శ్రీకాకుళం డిఎస్‌పి బివిఎస్ ఎస్ రమణమూర్తి పర్యవేక్షణలో సాగాయి.