ప్రజాశక్తి – టెక్కలి
ఎస్‌టి కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఈనెల 27, 28 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర నాయకులు వాబ యోగి ఒక ప్రకటనలో తెలిపారు. 27న జలుమూరు మండలం మాకివలసలో పర్యటించి గిరిజనుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. అదే రోజు హిరమండలం మండలంలోని అంతకాపల్లి, పునుపేట, సవితిసీది గ్రామాల్లో పర్యటిస్తారు. 28వ తేదీన ఆముదాలవలస మండలం అల్లిపిల్లిగూడ, పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు.