శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్
- డివిఇఒ తవిటినాయుడు
ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్
వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఆన్ ద జాబ్ శిక్షణ (వృత్యాంతర) ఉపయోగపడుతుందని ఇంటర్మీడియట్ విద్య జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి (డివిఇఒ) శివ్వాల తవిటినాయుడు అన్నారు. వృత్తి విద్య కోర్సుల అకాడమిక్ కేలెండర్ ప్రకారం ఏటా ఆన్ ద జాబ్ శిక్షణ నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం అక్షయ ఫౌండేషన్‌లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆన్ ద జాబ్‌పై బుధవారం శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోన్న అక్షయపాత్ర ఫౌండేషన్ కార్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సరుకుల సరఫరా, వివిధ రకాల ఆహార వంటల తయారీ విధానం, పంపిణీ, అకౌంటింగ్ పుస్తకాల నిర్వహణ అంశాలపై సంస్థ మేనేజర్ వెంకటరాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మరపట్ల పవన్ సూచనల మేరకు, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వదనగిరి ఆదేశాలతో విద్యార్థులకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ నిర్వహించామని అధ్యాపకులు దుగ్గివలస రాంప్రసాద్, కొర్రాయి రవి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎపిఎఒ, లైబ్రేరియన్ తాతారావు అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.