భోజనం నాణ్యతను పరిశీలిస్తున్న జిల్లా జడ్జి
- జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. మండలంలోని అంపోలులో గల జిల్లా జైలులో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఖైదీలతో మాట్లాడి భోజన సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు అవగాహనా సదస్సులో అందించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జైలు సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.