హెల్మెట్లను అందజేస్తున్న జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. తద్వారా ప్రమాద రహిత జిల్లాగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో పైడిభీమవరంలోని అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో కోర్టులో పలువురు ఉద్యోగులకు న్యాయమూర్తులతో కలిసి హెల్మెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కక్షిదారులతో స్నేహ సంబంధాలతో మెలగాలని ఆకాంక్షించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది సంరక్షణ కోసం ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హెల్మెట్లను అందజేసిన అపిటోరియా ఫార్మాకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు పి.భాస్కరరావు, సిహెచ్.వివేకానంద్, శ్రీనివాస్, ఎస్‌ఎం ఫణికుమార్, కె.కిషోర్, ఆర్.సన్యాసినాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయసేవా సాధికార సంస్థ సభ్యులు, ఆపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కె..నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కె.మదన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.