జగన్‌తోనే సంక్షేమం

మండలంలోని అల్లెనలో ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, స్పీకర్‌ తమ్మినేని

బూర్జ : ఇంటింటా ప్రచారం చేస్తున్న సీతారాం

ప్రజాశక్తి- బూర్జ

మండలంలోని అల్లెనలో ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేశారన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆయనకు హారతులు పట్టారు. సర్పంచ్‌ జడ్డు దివ్య, మహేష్‌. జడ్డు రమానంద్‌, రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌ గోవిందరావు, జెడ్‌పిటిసి బి.రామారావు, మాజీ ఎఎంసి చైర్మన్‌ గుమ్మడి రాంబాబు, ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు సురేష్‌ దొర, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ గోవిందరావు, వెంకటేష్‌ పాల్గొన్నారు.పాతపట్నం: స్థానిక మేజర్‌ పంచాయతీలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గుడ్‌ మార్నింగ్‌ పాతపట్నం కార్యక్రమం నిర్వహించారు. విద్యానగర్‌, విద్యానగర్‌ కాలనీ, యశోధనగర్‌, సంపంగి నగర్‌ తదితర వీధుల్లో పర్యటించి అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రదీప్‌. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మెళియాపుట్టి : మండలంలోని మారడికోటలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెద్దింటి భాగ్యం, శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి బి.ఉదయకుమార్‌, జెడ్‌పిటిసి ఎండయ్య, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగి, ఎఎంసి మాజీ వైస్‌ చైర్మన్‌ ఎ.రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : మున్సిపాలిటీలో 15వ వార్డులో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయకు మద్దతుగా చైర్‌పర్సన్‌ రాజ్యలక్ష్మి, వార్డు కౌన్సిలర్‌ పిలక ఈశ్వరి, ప్రకాశరావు పట్నాయక్‌, సాలిన ఢిల్లీ, గుజ్జు తారకేశ్‌, సంతోష్‌, విజయ, భాస్కరరెడ్డి పాల్గొన్నారు.అలాగే మండలంలోని హరిపురం, బొడ్డకల్లి గ్రామాల్లో ఎంపిపి బోర పుష్ప, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ లోకేశ్వరరావు, ఆసి పురుషోత్తంరెడ్డి, పి.రాజశేఖర్‌రెడ్డి, ఆసి కృష్ణారెడ్డి, బతకల మోహన్‌దాస్‌, కె.మోహనరావు, ఇంద్రసేనారెడ్డి, నూకయ్యరెడ్డిలు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కొత్తూరు: ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతికి మద్దతుగా వైసిపి నాయకులు ఓంశ్రీకృష్ణ, నాయకులు సారిపల్లి ప్రసాదరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, నాసా బాల కృష్ణ, జి.ఆనందరావు, తిరుపతిరావు, నాగేశ్వరరావు, కె.రమణ ప్రచారం చేశారు.టెక్కలి రూరల్‌ : టెక్కలి పంచాయతీలో వంశధార కాలనీ, కొత్తమ్మతల్లివీధి, శ్రీనివాస నగర్‌, ఎన్‌టిఆర్‌కాలనీల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గొండేల సుజాత, ఎంపిటిసి కూన పార్వతి, పీత హేమలత, అనంతయ్య, మహిళా జిల్లా అధ్యక్షులు చింతాడ మంజు పాల్గొన్నారు.

 

➡️