చెకుముకి సంబరాల్లో విజేతలు

జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌

చెకుముకి విజేతలకు బహుమతులు

శ్రీకాకుళం అర్బన్‌ : జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాల్లో బాగంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచి జలుమూరు మండలం కరవంజ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు రావాడ హేమ శిరీష, ఆర్‌.ఎర్రన్నాయుడు, టి.ధరణి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ప్రైవేట్‌ పాఠశాలల విభాగం నుంచి రణస్థలం మండలం శ్రీ నారాయణ స్కూల్‌, కోస్ట విద్యార్థులు ఎస్‌.రాజ్‌ కుమార్‌, ఎం.పల్లవి, ఎస్‌.మనోహర్‌కు ప్రథమ స్థానం దక్కింది. వీరు నవంబర్‌ 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ తెలిపారు. ప్రభుత్వ విభాగం నుంచి పాతపట్నం మండలం రొంపివలస జెడ్‌పిహెచ్‌ఎస్‌ ద్వితీయ స్థానం, లావేరు మండలం తామాడ మోడల్‌ స్కూల్‌ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. ప్రైవేట్‌ విభాగం నుంచి ఆమదాలవలస మండలం ఎస్‌.వి.ఎస్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు ద్వితీయ స్థానం దక్కించుకుంది. కన్సొలేషన్‌ బహుమతిని ఇచ్ఛాపురం మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌, సారవకోట మండలం బుడితి జెడ్‌పిహెచ్‌ఎస్‌, కవిటి మండలం జిహెచ్‌ఎస్‌, హిరమండలం మండలం గులుమూరు జెడ్‌పిహెచ్‌ఎస్‌ దక్కించుకున్నట్లు తెలిపారు. వారికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. జిల్లాస్థాయిలో పాల్గొన్న 216 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు.

➡️