సీమెన్‌ ఏజెంట్ల మోసంజైలుపాలవుతున్న యువ నావికులు

సీమెన్‌ ఏజెంట్ల మోసంతో జిల్లాలోని యువ నావికులు

ముంబయి జైలులో కొడుకును కలిసిన తల్లిదండ్రులు

ప్రజాశక్తి- సంతబొమ్మాళి

సీమెన్‌ ఏజెంట్ల మోసంతో జిల్లాలోని యువ నావికులు మోసపోతున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చేందిన యువ నావికుడు కొమర ప్రవీణ్‌ గత నెల 5 నుంచి ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్నాడు. కుటుంబానికి ఏకైక జీవనాధారం అయినందున, తీవ్ర బాధలో ఉన్న అతని కుటుంబం, అతని విడుదలకు సహాయం కోరుతూ భారత నావికుల సంఘం (ఎస్‌యుఐ)ని సంప్రదించారు. భారత నావికుల సంఘం అధ్యక్షుడు ఆర్‌.పి.వీట్టిల్‌ జోక్యం చేసుకోవడంతో, ప్రవీణ్‌ తల్లిదండ్రులు ఈ నెల 6న జైలులో ఉన్న తమ కొడుకును కలవడానికి అనుమతి పొందారు. అతని విడుదలకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని ఎస్‌యుఐ కుటుంబానికి హామీ ఇచ్చింది.ప్రవీణ్‌ ముంబైలో మోసపూరిత ఏజెంట్ల బారిన పడ్డాడు. వారు అతను ఓడలో ప్రయాణించకుండానే తన సిడిసిపై విదేశీ నౌక స్టాంప్‌ను చట్టవిరుద్ధంగా ముద్రించారు. అతను విదేశాలకు ప్రయాణించడానికి ప్రయత్నించినప్పుడు, ముంబై విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ విభాగం మోసపూరిత స్టాంపింగ్‌ను అనుమానించి ధ్రువీకరణ కోసం పంపింది. ఫోర్జరీ నిర్ధారణ తర్వాత, అతన్ని అంధేరి పోలీసులకు అప్పగించారు. తరువాత ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంచారు. అతని బెయిల్‌ పొందడానికి భారత నావికుల సంఘం చట్టపరమైన ప్రతినిధులతో చురుగ్గా సమన్వయం చేసుకుంటోంది. ఒక సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన ప్రవీణ్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. అతని తల్లిదండ్రులు తీవ్ర బాధలో ఉన్నారు. న్యాయం జరుగుతుందని, మోసపూరిత కార్యకలాపాల కారణంగా తప్పుగా చిక్కుకున్న యువ నావికుడు త్వరలో విడుదలవుతారని ఆశాగా ఉన్నారు. చాలామంది యువత ఏజెంట్లు చేస్తున్న మోసలా వల్ల జైలపాలు అవుతున్నారు. ఏజెంట్స్‌ సిడిసిపై తప్పుడు స్టాంప్స్‌ వేయడం వల్ల బయట దేశాలకు వెళ్తున్నప్పుడు ఇమ్మీగ్రేషన్‌ విభాగం అధికారులకు అనుమానం వచ్చి సిడిసి పరిశీలించారు. సిడిసిపై ఉన్న స్టాంప్స్‌ తప్పు అని తెలియడం వల్ల జైలుకు పంపించారు. సిడిసి, పాసుపోర్టుపై స్టాంప్స్‌ వేయడం చట్టారేత్యా నేరం. అలా చేయడం వల్ల జైలుకి వెళ్లడం, సిడిసి కూడా రద్దయ్యే అవకాశం ఉంది.

 

➡️