ప్రజల నడ్డి విరిచిన వైసిపి

టిడిపి విజయానికి మహిళలు కృషి చేయాలని టిడిపి జిల్లా

ఆమదాలవలస : సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస

టిడిపి విజయానికి మహిళలు కృషి చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. బుధవారం టిడిపి కార్యాలయ ఆవరణలో టిడిపి మహాశక్తి మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ మద్యం, ఇసుక, భూ దోపిడీలతో అక్రమార్జన ద్వారా రూ.6 లక్షల కోట్లు ప్రజల సొమ్మును జగనాసురుడు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్‌, ఆర్‌టిసి, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపుదలతో పాటు ఇంటి పన్నులు, చెత్త పన్నులు ప్రతి ఏడాది 15శాతం పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న విషయాన్ని మహిళలు అవగాహనతో ఆలోచించి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదిని ఎన్నికల్లో ఓడించాలన్నారు. మహళలు తోటి మహిళలకు టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించి రానున్న ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకులు తమ్మినేని గీత, బోయిన సునీత, కణితి విజయలక్ష్మి భారు, కూన వెంకట రాజ్యలక్ష్మి, కూటమి నాయకులు పేడాడ సూరపునాయుడు, పేడాడ రామ్మోహన్‌, నూకరాజు పాల్గొన్నారు.పొందూరు: పట్టణంలో యర్రావారి కళ్యానమండపంలో బుధవారం టిడిపి మండల మహిళా అధ్యక్షురాలు అనకాపల్లి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో టిడిపి విజయానికి మహిళలు అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహన్‌, టిడిపి మండల అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్‌, ఎంపిటిసిలు బాడాన హారిక, అనకాపల్లి వాణి, టిడిపి నాయకులు అన్నెపు రాము, బలగ శంకరభాస్కరరావు పాల్గొన్నారు.టిడిపిలో చేరికపొందూరు మండల కేంద్రంలో వైసిపికి చెందిన 20 కుటుంబాలు టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. పట్టణానికి చెందిన అనకాపల్లి సత్యం, వెంకటరావు, సంచెయ్య, చెల్లూరి పైడినాయుడులతో పాటు పలు కుటుంబాలకు చెందిన వారికి రవికుమార్‌ టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

 

➡️