పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంకవద్ద ఉన్న త్రిబుల్‌ ఐటీ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో 256 పోలింగ్‌ ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా వారి గమ్యాలకు తరలించారు. జిల్లా జాయింట్‌ కలెక్టరు సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందుకు గాను 1,750 మంది అధికారులు సిబ్బందిని నియమించినట్లు ఆర్‌ఓ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,958 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుందని ఆయన తెలిపారు.

➡️