ప్రజలకు అండగా నిలవాలి

ప్రజాశక్తి-మార్కాపురం: మంచి చేశాము.. కానీ ఏదో తప్పు జరిగింది.. ప్రజల తీర్పును గౌరవించాలి.. ప్రజలకు మనం అండగా నిలబడాలి.. అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూచించారు. మంగళ వారం తాడేపల్లిలో జగన్‌తో జరిగిన సమీక్షలో మార్కాపురం వైసిపి ఇన్‌చార్జి అన్నా వెంకటరాంబాబు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు మనం అండగా నిలబడాలని అన్నారు. వారికి ఎలాంటి కష్టమొచ్చినా భరోసా కల్పించాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలో ఓటమికి గల కారణాలపై చర్చించినట్లు తెలిసింది.

➡️