ప్రజాశక్తి….విజయనగరం టౌన్ : విజయనగరం నగరపాలక సంస్థ రూపాంతరం చెందిన తరువాత నాల్గవ సారిగా 156.93 కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్న బడ్జెట్నీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం మేయర్ వెంపడాపు.విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం జరిగింది. బడ్జెట్ లో ఈ బడ్జెట్లో సుమారు 72.45 కోట్ల రూపాయలతో నగర అభివఅద్ధి పనులుకు నిధులు కేటాయింపు,10.00 కోట్ల రూపాయల సాదారణ నిధులుతో కొత్తగా రోడ్లు వేయుటుకు,2.50 కోట్ల రూపాయల బి.పి.ఎస్. నీధులతో అభివఅద్ధి పనులు, 12.00 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివఅద్ధి పనులు,1.00 కోటి రూపాయలతో సచివాలయాల పక్కా భవనాలు నిర్మాణాల నిమిత్తము,,1.00 కోటి రూపాయలతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం, 1.50 కోటి రూపాయలతో హార్టికల్చర్ మరియు పట్టణ సుందరీకరణ నిమిత్తము, 5.00 కోట్ల రూపాయల సాదారణ నిధులుతో మురుగు కాలువలు నిర్మాణము మరియు కల్వర్టుల నిర్మాణము నిమిత్తము, 1.00 కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్, పార్కుల లైటింగ్, మరియు జంక్షన్ లైటింగ్, 1.50 కోట్లతో పార్క్స్ మరియు ప్లేగ్రౌండ్స్ అభివఅద్ధి పనులుకు కేటాయించడం జరిగింది. 1.00 కోటి రూపాయలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణము,2.50 కోట్ల రూపాయలతో నీటి సరఫరా కొరకు లైన్లు విస్తరణ, 1.00 కోటి రూపాయలతో కొత్త విద్యుత్ స్తంబాలు నిమిత్తము ,2.00 కోట్ల %చీజAూ% నిధులతో పట్టణములో కాలుష్య నివారణ పనులు,1.00 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ మరియు కళ్యాణమండపాలు, 50.00 లక్షలతో ఎస్.సి మరియుఎస్.టి సబ్ ప్లాన్ నిధులుతో అభివఅద్ధి పనులు, 6 50.00 లక్షలతో కొత్త బోర్లు వేయుటుకు,1.25 కోట్లతో ట్రాఫిక్ ఐల్యాండ్స్ అభివఅద్ధి పనులు,1.25 కోట్లతో చెరువులు సుందరీకరణ మరియు అభివఅద్ధి,2.00 కోట్ల రూపాయలతో నగర పాలక సంస్థ ఆస్తులు రక్షణ నిమిత్తము ప్రహరి గోడలు, 1.00 కోటి రూపాయలతో ఆధునిక జంతు వధశాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. ఈ బడ్జెట్ నీ స్టాండింగ్ ఆమోదిస్తు కొన్ని అధాయాలు పెంచే మార్గాల పై దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా నగర పాలక సంస్థ భూములు,.అదే విధంగా ట్రెడ్ లైసెన్స్ లు పెంచడం, ప్రకటనలు ఆదాయం పెంచేందుకు కఅషి చేయాలని పలు సూచనలు కమిటీ సభ్యులు ఎస్ వి వి రాజేష్,.బాబు, అల్లు చాణక్య, రేగాన రూపవతి, లు చేయడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు లో పలు రంగాలకు సంబంధించిన కేటాయింపులపై కమిటీ సూచనలు చేయడం జరిగింది. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 2025.26 బడ్జెట్ నగరాభివృద్ధికి సహకరించే బడ్జెట్ ను తయారు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని తుది బడ్జెట్ రూపొందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కమీషనర్ నల్లనయ్య, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు,అన్ని శాఖలు అధికారులు,సిబ్బంది,గనక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.