ఘనంగా ఎస్వీ కన్వెన్షన్‌ హాల్‌ ప్రారంభం

Apr 16,2025 17:12 #Grand opening, #SV Convention Hall

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రావాడ సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శ్రీవినాయక కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించి బుధవారం ప్రముఖుల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వినియోగదారులకు అన్ని వసతులతో కూడిన కన్వెన్షన్‌ హాల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. పలువురు శ్రేయోభిలాషులు ఈ స్థలాన్ని ప్లాట్‌ లుగా చేసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారన్నారు. అయినా పలువురికి వినియోగంగా ఉండేలా ఏదైనా నిర్మించాలని సంకల్పించి, విజ్ఞుల సూచనలతో ఈ కన్వెన్షన్‌ నిర్మాణం చేసినట్లు సత్తిబాబు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ప్రముఖులే కాకుండా వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై సత్తిబాబును అభినందించారు. అనంతరం కళ్యాణ హాలులో కుటుంబ సమేతంగా సత్తిబాబు శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణ మహౌత్సవాన్ని ఘనంగా నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

➡️