పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

ప్రజాశక్తి-కొండపి : రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. ఒంగోలు-1, పొదిలి-1, కందుకూరు-1, కొండపి పొగాకు వేలం కేంద్రాల్లో మొట్టమొదటిగా సోమవారం నాడు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో వేలం నిర్వహణాధికారి జి సునీల్‌కుమార్‌ అధ్యక్షతన రైతులను ఉద్దేశించి చైర్మన్‌ మాట్లాడుతూ ఎపిలోని 16 వేలం కేంద్రాలలో ఈ సంవత్సరం 167 మిలియన్లు కెజిల పొగాకు అనుమతించినట్లు తెలిపారు. రూ.300 నుంచి మద్దతు ధర ఇవ్వాలి: సిపిఎంపొగాకు రైతులు అప్పుల ఊబిలో నుంచి బయట పడాలంటే కెజికి రూ.300 నుంచి రూ.340 వరకూ మద్దతు ధర ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కెజి మస్తాన్‌ డిమాండ్‌ చేశారు. బోర్డు సిబ్బంది రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మస్తాన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్‌ చైర్మన్‌ బొడ్డపాటి బ్రహ్మయ్య, సిఓఎఫ్‌ఎఫ్‌ కమిటీ మెంబర్‌ కల్లూరి హరిబాబు, ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ వైస్‌ చైర్మన్‌ పోటు మురళిబాబు, పొగాకు బోర్డు పరిధిలోని రైతులు పాల్గొన్నారు.అత్యధిక ధర రూ.280 కొండపి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం నాడు మొదటి రోజున జువ్విగుంట క్లస్టర్‌ జువ్విగుంట గ్రామం నుంచి 18 బేళ్లను అమ్మకానికి ఉంచారు. అందులో 18 బేళ్లు కొనుగోలు చేశారు. 18 బేళ్లలో 16 బేళ్లకు కెజి రూ.280 పలికింది. మిగిలిన రెండు బేళ్లకు రూ.278 పలికింది. అత్యధిక ధర రూ.280, అత్యల్ప ధర రూ.278, సరాసరి ధర రూ.279.86 పలికింది. వేలం కేంద్రంలో 7 కంపెనీల వారు పాల్గొన్నారు.

➡️