బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం) : ప్రజలు బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివఅద్ధి మత్స్యశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం టెక్కలిలో పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను పూజలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి 7 బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ బస్సులు శ్రీకాకుళం-1, 2 టెక్కలి డిపోలకు చెందిన వివిధ రూట్లకు సర్వీసు అందిస్తాయన్నారు. టెక్కలి – శ్రీకాకుళం – అమలాపురం మార్గంలో ఒక కొత్త సూపర్‌ లగ్జరీ బస్సు, టెక్కలి – విశాఖపట్నం – ఇచ్ఛాపురం మార్గంలో ఒక కొత్త ఎక్స్‌ ప్రెస్‌, టెక్కలి – విశాఖపట్నం – ఇచ్ఛాపురం మార్గంలో ఒక కొత్త (అద్దె ఎక్స్‌ ప్రెస్‌), శ్రీకాకుళం – విజయవాడ మార్గంలో ఒక కొత్త సూపర్‌ లగ్జరీ బస్సు, శ్రీకాకుళం – విజయనగరం మార్గంలో ఒక ఎక్స్‌ ప్రెస్‌, శ్రీకాకుళం – బత్తిలి మార్గంలో ఒక అద్దె పల్లె వెలుగు, శ్రీకాకుళం – విశాఖపట్టణం మార్గంలో ఒక అద్దె అల్ట్రా డీలక్స్‌ బస్సులు ఆయా రూట్లలో ప్రజలకు సర్వీసులు అందిస్తాయన్నారు. ఇందులో మూడు బస్సులు అద్దెవని, నాలుగు బస్సులు ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బస్సుల సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బాగాది శేషగిరిరావు,పిసకాన అజరు కుమార్‌, కోల లవకుమార్‌, లాడి శ్రీనివాసరావు, హనుమంతు రామకఅష్ణ, కెల్లి శ్రీరాములు, ఆర్‌ఎం, శ్రీకాకుళం 1,2 టెక్కలి డిపోల మేనేజర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️