తొలిసారిగా పల్నాడుకు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ వేళ … జిల్లాలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించేందుకు పల్నాడు జిల్లాకు తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మంగళవారం వచ్చారు. పల్నాడు జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తాలను జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి కేష్‌ బి లాట్కర్‌, జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఏ శ్యాంప్రసాద్‌, జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి.సరోజ, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ వేళ … పల్నాడు జిల్లాలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం ఈవిఎం బ్యాలెట్‌ బాక్స్‌ లు, ఎన్నికల పరికరాలు భద్రపరిచిన జె.ఎన్‌.టి.యు కళాశాల స్ట్రాంగ్‌ రూమును కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

➡️