ప్రజాశక్తి-విజయనగరం : నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సాదర స్వాగతం పలికారు. జిల్లా కోర్టుకు చెందిన పలువురు న్యాయాధికారులు కూడా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ ఇతర న్యాయాధికారులతో జెడ్పీ అతిధి గృహంలో కొద్దిసేపు ముచ్చటించారు.
