ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని జోగంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు మంగళవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా డిఇఒ ఎన్ తిరుపతి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రధానంగా ఆడపిల్లలు ఈ విలువిద్య పోటీల్లో రాణించడం ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బాల బాలికలు 821 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. అండర్ -14లో 12 మంది బాలికలు, 12 మంది బాలురు, అండర్ -17లో 12 మంది బాలికలు 12 మంది బాలురు, అండర్-19లో 12 మంది బాలికలు, 12 మంది బాలురు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ విజేతలంతా గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ రాష్ట్ర పరిశీలకులు రాధాకృష్ణ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానంచ ఏశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం. మురళీకృష్ణ, డిప్యూటీ డిఇఒ రాజకుమార్, సీతానగరం పార్వతీపురం ఎంఇఒలు జి సూర్యదేముడు, ప్రసాద్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయులు డిటి గాంధీ, ఎం శ్రీనివాసరావు, బి వైకుంఠరావు, కె నాగమణి, కే తిరుపతిరావు, ప్రిన్సిపాల్ జివిఎస్ మధుబాబు, వివిధ జిల్లాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.