హోరాహోరీగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ప్రజాశక్తి-సంతనూతలపాడు : స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూలు ప్రాంగణంలో ఎన్నారై డాక్టర్‌ సూదనగుంట రాఘవేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో సూదనగుంట ఫౌండేషన్‌ నిర్వాహకులు సూదనగుంట కృష్ణ మూర్తి పర్యవేక్షణలో సూదనగుంట కోటయ్య చౌదరి అండ్‌ ఆదిలక్ష్మి మెమోరియల్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న 71వ రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల కబడ్డీ పోటీలు గత మూడు రోజుల నుంచి హోరా హోరీగా జరుగుతున్నాయి. సోమవారం పురు షుల విభాగంలో విజయనగరం-శ్రీకాకుళం, కృష్ణా-విశాఖపట్నం, గుంటూరు-వెస్ట్‌ గోదా వరి, ప్రకాశం-నెల్లూరు జిల్లాల జట్లు తలపడ్డా యి. మహిళల విభాగంలో గుంటూరు- కర్నూలు, విజయనగరం-చిత్తూరు జిల్లాలు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు జి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియ ర్‌ కబడ్డీ కోచ్‌ ఖాదర్‌బాషాను శాలువా కప్పి బొకే అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ క్రీడలను కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీకాంత్‌, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు, హైదరా బాద్‌ డీఎస్పీ అన్ను వేణుగోపాల్‌, కబడ్డీ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, టోర్నమెంట్‌ ఆర్గనైజర్స్‌ మందాడి వెంకటేశ్వర్లు, సూదనగుంట వేణుబాబు, పి నారాయణస్వామి చౌదరి, ముప్పరాజు శ్రీనివాసరావు, బొడ్డు శంకర్‌ తదితరులు పర్యవేక్షించారు.

➡️