విగ్రహాలను కూల్చాలని చూస్తే చర్యలు

 నకరికల్లు: గ్రామాలలో ఎవరైనా రాజకీయ నాయకుల విగ్రహాలను కూల్చాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు.మండలంలోని నరసింగపాడులో తహశీల్దార్‌, ఎస్సై నాగేంద్రరావుతో కలిసి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచి వాలయం పరిధిలోని పంచాయతి కార్యదర్శి, విఆర్వోలు, విఆర్‌ఎలు, గ్రామస్తులతో కలిపి శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లన్నారు. రాజకీయ పార్టీలపరంగా ఘర్షణలకు దిగితే వారి సమాచారం తమకు అందజేయాలని గ్రామస్తులకు తెలి పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎస్‌.శివారెడ్డి పాల్గొన్నారు.

➡️