ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : ఇటీవల కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు, పలుచోట్ల వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. తాళ్లరేవు మాధవరాయనిపేట, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వ్యవసాయ భూములు నీటమునగడంతో మాధవరాయుడుపేట ప్రాంతంలోని డ్రైనేజీలు ఎగదన్నాయి. దీంతో తాళ్లరేవు మాజీ ఎంపీటీసీ గంజా సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం డ్రైనేజీలను బాగు చేయించారు. ప్రధాన మరుగు కాలువ యంత్రాలతో శుభ్రం చేసి ముంపు నీరు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
