ప్రజాశక్తి – పంగులూరు: పంగులూరు మండలంలో భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కషి చేస్తున్నట్లు చీరాల ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండ లంలో ప్రధానంగా ఇప్పటివరకు రెండు భూ సమస్యలు వచ్చా యని, వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మండలం లోని చందలూరు గ్రామంలో సర్వేనెంబర్ 737లో 28 ఎకరాల 62 సెంట్లు గ్రామ కంఠం ఉందని, ఈ భూమిలోనే గ్రామం మొత్తం ఉందని అని చెప్పారు. అయితే ఇందులోనే మూడు దేవస్థానాలకు చెందిన 17 సెంట్లు భూమి కూడా ఉం దని, ఈ భూమిని ఇంతవరకు సబ్ డివిజన్ చేయలేదని చెప్పారు. దేవాలయాలకు చెందిన 17 సెంట్లు భూమిని సబ్ డివిజన్ చేయని కారణంగా, గ్రామంలో ఇల్లు గాని, ఇళ్ల స్థలాలు గాని కొనుగోలు, అమ్మకాలు జరపటానికి వీలు లేకుం డా పోయిందని చెప్పారు. ఈ సమస్య గత ఎనిమిది సంవ త్సరాల నుండి ఉందని, అప్పటినుండి గ్రామస్తులు అనేక రకా లుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరి ష్కరించాలంటే దేవాలయాలకు చెందిన 17 సెంట్లు భూమిని సబ్ డివిజన్ చేసి, గ్రామ కంఠం నుండి విడగొట్టాలని అలా చేసినప్పుడు గ్రామంలోని ఇల్లు, ఇళ్ల స్థలాలు అమ్మకాలు, కొనుగోలు జరుపుకోవడానికి అవకాశం జరుగుతుందని చెప్పారు. తక్షణమే సమస్యను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సూర్యనారాయణ రెడ్డి చెప్పారు. తూర్పు తక్కలపాడు గ్రామంలో 57 మంది రైతులకు చెందిన 60 ఎకరాల భూమి రైతు వారి పట్టాలు లేకపోవడం వలన భూమి వారి చేతిలో ఉన్నా దానిపై హక్కులు లేవని ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి చెప్పారు. ఈ భూమి 1962లో ఎఫ్‌ఎల్‌ఆర్‌లో పెండింగ్ అని రాసి ఉండటం వలన, ఆ భూమిని రైతులకు సెటిల్మెంట్ చేయలేదని, అందువలన వారికి రైతు వారి పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. ఆ భూమిని సర్వే చేసి విచారణ జరిపి, జాయింట్ కలెక్టర్‌కు రిపోర్ట్ పంపాలని, మరలా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి ఆయన సెటిల్మెంట్ చేసి, రైతు వారి పట్టాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డి.నాగరాజు రావు ఉన్నారు.