పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా చర్యలు

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ పోలింగ్‌ విధులలో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌ అధికారుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 26 వరకు ఉండటంతో సంబంధిత దరఖాస్తులను సిబ్బంది నుంచి పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ ఆర్‌ శ్రీలత, పోస్టల్‌ బ్యాలెట్ల జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ వి విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️