కడుపుబ్బ నవ్వించిన ‘వినోదాల విందు’

కడుపుబ్బ నవ్వించిన 'వినోదాల విందు'

ప్రజాశక్తి-సీతమ్మధార : ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో అదివారం ఫ్రెండ్స్‌ కామెడీ క్లబ్‌ ‘వినోదాల విందు’లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సంస్థ అధ్యక్షులు ఎంవి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో హరిహర నృత్యనికేతన్‌ డాన్స్‌ స్కూల్‌ గురువు అల్లు వెంకటరమణ శిష్యులు అనూష, అనన్య. సాంప్రదాయ నృత్యప్రదర్శన అలరించింది. అనంతరం వడ్డాణం, సెల్‌ఫోన్‌, నూడిల్స్‌, పెదవి చిట్లింది. తాగుబోతు, కోర్టు సీన్‌, దొందుకు దొందే డాక్టర్‌ పేషెంట్‌, లవర్‌ మీద కేసు, ప్రూఫ్‌, 4సిమ్స్‌, రివర్స్‌ పంచ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, డైమండ్‌ నెక్లెస్‌, ముందుజాగ్రత్త, అబ్బాయికి మాటలొచ్చాయి, 108 వంటి లఘునాటికలు, స్కిట్స్‌ అలరించాయి. జబర్దస్త్‌ ప్రకాష్‌. ఎంవి సుబ్రహ్మణ్యం. వెంకటేశ్వరరావు. పోర్ట్‌ శేషు, భానుప్రకాష్‌, శివ జ్యోతి,. పుష్యమి. ఈశ్వరరావు, సీత తమ నటనతో నవ్వులు పూయించారు. అనంతరం కళాకారులను తిలక్‌ పట్నాయక్‌, ఆడిటర్‌.సన్‌ మూర్తి, స్టీల్‌ప్లాంట్‌ రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌ మాల్యాద్రి మెమొంటోలతో సత్కరించారు.

స్కిట్‌ ప్రదర్శిస్తున్న ఎంవి.సుబ్రహ్మణ్యం, అడవిరాజు తదతరులు

➡️