వైసిపి పాలనలోని శిలాఫలకాలు ధ్వంసం

Jun 10,2024 00:39

రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెంలో ధ్వంసం చేసిన శిలాఫలకం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి/ మంగళగిరి రూరల్‌ :
టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించడం, పేర్లు మార్చడం వంటి చర్యలకు పాల్పడిన వైసిపి నాయకుల బాటలోనే తాజాగా టిడిపి నాయకులు కూడా పయనిస్తున్నారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో మాజీ సిఎం జగన్‌ గతేడాది మేలో రాజధాని గ్రామాల్లో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం ఆదివారం వెలుగుచూసింది. అమరావతి ప్రాంతంలో జగన్‌ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన సమయంలో కష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు, స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గుంటూరులో ఎన్‌టిఆర్‌ స్టేడియంలో ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందు ఏర్పాటు చేసిన జిమ్‌ కేంద్రాన్ని వైసిపి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను టిడిపి నాయకులు సిరివరపు శ్రీధర్‌, రావిపాటి సాయికృష్ణ తదితరులు ఆదివారం ధ్వంసం చేశారు. శిలాఫలాకాలను తొలగించి జిఎం సెంటర్‌కు ఎన్‌టిఆర్‌ జిమ్‌ సెంటర్‌ అని పేరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయ కులు మాట్లా డుతూ ఎన్‌టి ఆర్‌ స్టేడియ ంలో వైఎస్‌ పేరుతో జిమ్‌ ఏర్పాటును ఖండించారు.

గుంటూరు ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శిలాఫలకాన్ని ధంసం చేస్తున్న టిడిపి శ్రేణులు

➡️