ప్రజాశక్తి-వీరఘట్టం : ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని సబ్‌కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి రైతు సేవా కేంద్ర సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం మండలంలోని తూడి రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం అమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆర్‌ఎస్‌కె సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, ఎంఆర్‌ఐ లక్ష్మునాయుడు, వ్యవసాయ అధికారి సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : రైతులను ఇబ్బందులు లేకుండా చేయాలని సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. మండలంలో సింగన్నవలస రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం పరిశీలించి, వెంటనే మిల్లర్లకు పంపించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఎక్కడా, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎఒ వాహిణి, సిడిఎస్ డిటి మల్లీశ్వరరావు ఉన్నారు.