ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : మండల పరిధిలోని ప్రజలందరూ రాబోవు సంక్రాంతి పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని బి.కొత్తకోట సిఐ జీవన్ గంగాధర్నాథ్ బాబు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ … ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జూదగాళ్లను, కోడి పందాలుకు అనుమతి లేదన్నారు. సంక్రాతి పండుగ ముసుగులో జూదాలు, కోడిపందాలు, జల్లికట్టు లాంటి క్రీడలు, ఇతర చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. పండుగల వేళ ప్రత్యేక బృందాలతో గస్తీ నిర్వహిస్తామని, గత సంఘటనల ఆధారంగా నిఘా ఉంచుతామన్నారు. ఇప్పటికే పాత కేసుల్లో కొంతమంది ముద్దాయిలను బైండోవర్ చేయడం జరిగింది. వ్యసనాలకు బానిసలై పండగల పూట కూడా వినోదం పేరుతో కోడి పందాలు, జూదం ఆడి నష్టపోయి కుటుంబాలలో శోకాన్ని నింపవద్దని హితవు పలికారు. కుటుంబ సమేతంగా మంచి వాతావరణంలో పండగలను జరుపుకోవాలని సూచించారు.
పండుగ ముసుగులో జూదం, కోడి పందాలకు పాల్పడితే కఠిన చర్యలు : బి.కొత్తకోట సిఐ
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/police-3.jpg)