లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Feb 1,2025 21:43

ప్రజాశక్తి-బొబ్బిలి :  లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఒ రామ్మోహనరావు హెచ్చరించారు. శనివారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో పిసి అండ్‌ పిఎన్‌డిటి చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలలో ఆడపిల్లగా తేలితే అబార్షన్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపొద్దని కోరారు. ఆడపిల్లలను రక్షించేందుకు పని చేయాలని ఐసిడిఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బందికి సూచించారు. సమావేశంలో వైద్యులు సంతోషికుమారి, రాజారాణి, ఎం.సంధ్య, ఎస్‌ఐ రమేష్‌, అంగన్వాడీ సూపర్‌వైజర్‌ సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️