సరిపల్లిలో అక్రమ లేఅవుట్‌ చేస్తే కఠిన చర్యలు : పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : గణపవరం మండలంలో సరిపల్లి కొత్తపల్లికి వెళ్ళే రహదారిలో అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సరిపల్లి పంచాయితి కార్యదర్శి డి.రామాంజనేయులు హెచ్చరించారు. సరిపల్లి పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తే వారికి రహదారి, మంచినీటి సౌకర్యం, వీధి లైట్లు కి అనుమతులు ఇవ్వబోమని అన్నారు. అంతేకాకుండా పంచాయతీ అనుమతి లేకుండా లేఅవుట్లు వేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసేవారు పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత స్థలాలు కొనుగోలు చేసుకోవాలని కోరారు. వివరాలు తెలుసుకోకుండా స్థలం కొనుగోలు చేస్తే నష్టపోయే పరిస్థితి కలుగుతుందని అన్నారు.

➡️