కట్టుదిట్టంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ ద్వారా సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలపై జిల్లా నీటి వనరుల శాఖ, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన 167 చెరువులకు సంబంధించి డిసెంబర్‌ 8న నీటివినియోగదారుల, సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. డిసెంబరు 5వ తేది సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడు తుందన్నారు. డిసెంబరు 8వ తేదీ ఒకే రోజు పూర్తి ఎన్నికల ప్రక్రియ ఉంటుం దిన్నారు. నామినేషన్లు ప్రక్రియ, 6 మంది ప్రాదేశిక సభ్యుల, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను పార్టీలకతీతంగా సుహద్భావ వాతావరణంలో వీలైనంత వరకు ఏకగ్రీవ తీర్మనాలతో జరపాలని ప్రభుత్వం భావిస్తుందని ఆ మేరకు జిల్లాలో కూడా పటిష్టంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు. ఎన్నిక అనంతరం సదరు సాగునీటి సంఘాల ద్వారా రైతులు తమ చెరువులను తామే ప్రభుత్వ సహకారంతో నిర్వహించుకోగ లుగుతారని చెప్పారు. ప్రతి సాగునీటి సంఘంలో 6 మంది ప్రాదేశిక సభ్యులు ఎన్నికవుతారన్నారు. వారిలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపారు. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి, స్థానిక సంస్థల ఎన్నికలకు కావలసిన అన్ని సాదారణ అర్హతలతో బాటు 1432 ఫస్లీ వరకూ నీటి తీరువా చెల్లించిన రైతులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. విసిలో జెసి ఆదర్శ రాజేంద్రన్‌, డిఆర్‌ఒ మధుసూదన్‌రావు, సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డిఒ, తహశీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.వంద శాతం పింఛన్లు పంపిణీ చేయాలి జిల్లాలో ఈనెల 30న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను నూరు శాతం పంపిణీ చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ లోని విసి హాల్‌ నుంచి సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డిఒ, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఎంఇఒలు, ఎంఎఒ, ఇఇలు, డిఇలు, ఎఇలు, సచివాలయ సిబ్బంది తదితరులతో పింఛన్ల పంపిణీ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు, రెవిన్యూ సర్వీసులు, పల్లె పండుగ పనులు, విద్యార్థు లకు అపార్‌ ఐడీల మంజూరు, బ్యాంక్‌ అకౌంట్లకు ఆధార్‌ లింక్‌, సర్వే రాళ్లపై బొమ్మల తొలగింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ, పశుగణన, పంటల ఈ క్రాప్‌, సిసి కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 30వ తేదీన పింఛను పంపిణీ చేసే సిబ్బంది అందరూ తెల్లవారుజామున ఐదున్నర గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలని, ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా పెన్షన్‌ పంపిణీ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారమే బ్యాంకుల నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాటులకు తావు ఇవ్వకుండా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సిఇఒ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదులపై తహశీల్దార్లు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో తప్పనిసరిగా మాట్లాడి నాణ్యతతో అర్జీలను పరిష్కరించాలన్నారు. పిజిఆర్‌ఎస్‌ దరఖాస్తులను కూడా నిరీ?త కాల పరిమితిలోగా నాణ్యతతో వేగంగా పరిష్కరించాలన్నారు. ఎమ్మార్వోలు ఆధార్‌ మంజూరు కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు.

➡️