ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈ నెల 13 నుంచి జరిగే ే విజయ నగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండగకు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి ఎస్‌పి వకుల్ జిందాల్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. పండగకు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఉత్సవాలు, పండగ రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులతో సంప్రదించి వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగు ప్రాంతాలను, లైటింగు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్లలో ఎటువంటి స్నాచింగ్స్ జరగకుండా బందోబస్తు, క్రైం బృందాలను నియమించా లన్నారు. వృద్ధులు, వికలాంగుల అవసరమైన సేవలందించేందుకు సేవాదళ్ ఏర్పాటు చేయాల న్నారు. సిరిమాను తిరిగే రహదారి లోకి పెద్ద సంఖ్యలో భక్తులు చొరబడ కుండా ముఖ్య కూడళ్ళలో భారీకేడింగు ఏర్పాటు చేయాలన్నారు. సిరిమానోత్సవ పూర్తయ్యే సమయానికి చీకటి పడి, కరెంటు సప్లయి కూడా నిలిచిపోనున్నందున ప్రత్యామ్నా యంగా లైటింగు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత, డిఎస్‌పిలు ఎం.శ్రీని వాసరావు, ఎవి లీలారావు, ఆర్‌విఆర్‌కె చౌదరి, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.