బలమైన ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మన దేశపు మువ్వన్నెల జాతీయ పతాకం సగర్వంగా ఎగరాలంటే ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, కోల్‌, స్టీల్‌, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, డిఫెన్స్‌, విద్యుత్‌ తదితర పభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడం మానుకోవాలని ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఆదివారం డివిజనల్‌ కార్యాలయ ఆవరణలో ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి ఎందుకు అవసరం?’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షోభాల నుంచి భారతదేశాన్ని ప్రభుత్వ రంగమే కాపాడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాట వరసకు ఆత్మనిర్భరత అంటోందని, కానీ ఆచరణలో ప్రభుత్వ రంగ సంస్థలకు వాటి కార్యకలాపాలని అవే నిర్ణయిం చుకునే ‘ఫంక్షనల్‌ అటానమీ’ ఇవ్వడం లేదన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కేవలం వ్యవసాయ సంక్షోభమే కారణం కాదని, విద్యా, వైద్య రంగాలు ప్రయివేటీకరణకు గురి కావడం, రైతుల జీవితాల్ని ఛిద్రం చేయడంతో బతకలేక, దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఉద్ఘటించారు. ఆంధ్రప్రదేశ్‌ ను, అమరావతిని కార్పొరేట్‌ సంస్థల ద్వారా అభివద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చెప్పే మాటలు అసంబద్ధమని పేర్కొన్నారు. ప్రయివేటీకరణ మత్తులో పాలకులు మాత్రమే ఉన్నారని, ప్రజలు దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నారని తెలిపారు. రిలయన్స్‌ జియోపై వినియోగదారులు నమ్మకం కోల్పోవడమే దీనికి తాజా సూచిక అన్నారు. కార్పొరేట్‌ మీడియా సష్టిస్తున్న మాయాజాలాన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావి వర్గం సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా ప్రయివేటీకరణ దాడిని తిప్పి కొట్టగలమని చెప్పారు. ఎల్‌ఐసిని రెండు దశాబ్దాల ప్రయివేటు పోటీ తర్వాత కూడా అగ్రశ్రేణిలో సిబ్బంది నిలబెట్టుకోవడం దీనికి ఉదాహరణ అన్నారు. డివిజన్‌ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సంఘాల నాయకులు రఘునాథ్‌రెడ్డి, వసుప్రద, శంకర్రావు, మహేశ్వర్‌ రెడ్డి, సంజరు, నిత్యానంద రెడ్డి (ఇన్సూరెన్స్‌), శ్రీనివాసుల రెడ్డి (సిఐటియు), లక్ష్మీ రాజా (యుటిఎఫ్‌), సుధాకర్‌, సుబ్బారావు (బిఎస్‌ఎన్‌ఎల్‌), అజీజ్‌, సాయికుమార్‌ (బ్యాంకింగ్‌), శివశంకర్‌ (విద్యుత్‌), సుబ్బారెడ్డి (పోస్టల్‌), రమణ (ఎస్సీ అధికారుల సంఘం), ఆచార్య రాంప్రసాద్‌ రెడ్డి (వైవీయూ), నరసింహారెడ్డి (జెవివి), దస్తగిరి రెడ్డి (రైతు సంఘం), ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు అక్బర్‌, సుధీకర్‌, అయ్యవారు రెడ్డి, వారిజాతమ్మ, రాజు, రత్నకిషోర్‌, రఘు, కుమార్‌, చిన్నయ్య, సాదక్‌, శ్రీనివాసులు, ఎల్లయ్య పాల్గొన్నారు.తాత్విక చింతనతోనే సామాజిక పురోభివృద్ధి ప్రజాశక్తి – కడప ప్రతినిధి : తాత్విక చింతనతోనే సా మాజిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రాచీన తాత్విక సిద్ధాంతాల్లోని అభ్యుదయ భావాలతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలని మాజీ ఎంఎల్‌సి ఎం.వి.ఎస్‌ శర్మ పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా పరిషత్‌ ఆవరణంలోని పంచాయతీరాజ్‌ భవన ంలో బుద్ధిస్ట్‌ కల్చరల్‌ సొసైటీ సభ్యులు పిళ్లా కులాయి స్వామి అధ్యక్షతన మధ్య యుగాల్లో భారతీయ తాత్విక చింతన అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్తమానానికి ఉపయోగ పడే లా తాత్విక దృష్టి ఉండాలన్నారు. మతం వేరు..మతం పేరుతో రాజక ీయాలు నడపడం ప్రజలకు ద్రోహం చేయడమే అవు తుందని తెలిపారు. తాత్విక చింతనను చరిత్ర నుంచి విడగొట్టడం కష్టమని చెప్పారు. కీ.శ ఆరవ శతాబ్ధం నుంచి బౌద్ధ, జైన మతాలు వర్థిల్లాయని తెలిపారు బౌద్ధం పశువులను వ్యవసాయానికి మళ్లించడంతో బహునులు బౌద్ధం వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. గుప్తుల పతనం అనంతరం చేతివృత్తుల వాళ్లు గ్రామాల్లోకి ప్రవేశించడంతో బ్రాహ్మణాధిపత్యానికి సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. భక్తి ఉద్యమం అనంతరం సంఘసంస్కర్తలు వెలుగులోకి వచ్చారన్నారు. అనంతరం ప్రముఖ కవి దాదా హయత్‌ ఇస్లాం – సూఫీ – క్రిస్టియానిటీ అనే అంశంపై మాట్లాడుతూ యూనివర్శల్‌ బ్రదర్‌ హుడ్‌ను దెబ్బతీయడానికి సిటిజన్‌ షిప్‌ను తీసుకొ చ్చారన్నారు. యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌లోని మౌలిక లక్ష్యం ముస్లిములు, క్రిస్టియన్లు, బౌద్ధులపై మను స్తృతిని రుద్దడమేనని తెలిపారు. కార్యక్రమంలో బుద్దిస్ట్‌ కల్చరల్‌ సభ్యులు ప్రసాద్‌, ప్రముఖ వైద్యులు ఓబుల్‌రెడ్డి, రాజావెంగల్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దస్తగిరిరెడ్డి పలువురు ఇంటలెక్చు వల్స్‌ పాల్గొన్నారు.ఇష్టానుసారంగా వక్ఫ్‌ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ఇష్టానుసారంగా మారుస్తూ ఉందని మాజీ ఎంఎల్‌సి ఎం.వి.ఎస్‌ శర్మ పేర్కొన్నారు. ఆదివారం కడప ఇస్లామిక్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఉస్మాన్‌ ఖాన్‌ మసీదు లో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో సచార్‌ కమిటీ, రంగనాథ కమిటీ ఏదైతే రిపోర్ట్‌ ఇచ్చిందో దానిని అమలు చేయకుండా, ప్రస్తుత బిల్లును అమలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. లౌకిక తత్వాన్ని ముస్లిములు మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రజాశక్తి సాహితీ స్రవంతితో కలిసి పని చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బాబు బారు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, పలువురు ముస్లిమ్‌ సోదరులు పాల్గొన్నారు.

➡️