స్ట్రాంగ్‌రూం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

స్ట్రాంగ్‌రూం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి -పాడేరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌, ఎం విజయసునీత గురువారం తనిఖీ చేసారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గం, పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం ఇవిఎంలను భద్రపరిచిన గదులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమరాలు సక్రమంగా నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇతరులు డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించకుండా తగిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాడేరు అరకువ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు, జాయింట్‌ కలెక్టర్‌ భావనా పశిష్ట, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ పాల్గొన్నారు..

స్ట్రాంగ్‌రూం పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయ సునీత

➡️