ఘనంగా ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవం

Jun 9,2024 16:15 #adhoni

ప్రజాశక్తి -ఆదోని:ఆదోనిలోని మున్సిపల్‌ ఉననత పాఠశాలలో జిల్లా నాయకులు పి నాగేంద్రప్ప అధ్యక్షతన ఎస్టీయు 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్‌ తిమ్మన్న, రాష్ట్ర సహాధ్యక్షులు సి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వి రమేష్‌ నాయుడు హాజరు ఎస్టీయూ జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలను, ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తూ తొలి పిఆర్‌సి నుండి అకుంటిత దీక్షతో అప్రెంటీస్‌ వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందించిన సంఘమని కొనియారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు లోక్య నాయక్‌, జి.వీరచంద్ర యాదవ్‌,రవి, భీమరాజ్‌, శ్రీనివాసులు, తిమ్మప్ప, అయ్యప్ప, హనుమన్న, నారాయణ, జ్యోతి మూర్తి, ప్రసాద్‌, ఉరుకుందప్ప, రాముడు, శ్రీనివాసులు, కాశీ విశ్వనాథ్‌, జంబులయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు

➡️