రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Apr 12,2025 21:55

 ప్రజాశక్తి-గంట్యాడ : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన విజయనగరం-బొడ్డవర జాతీయ రహదారిపై గింజేరు కూడలిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోరాపుట్‌ జిల్లా బందుగామ మండలం అలమండ గ్రామానికి చెందిన ఆరిబిల్లి నాని (20) విజయనగరంలోని ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాలలో బిఎస్‌సి రెండో ఏడాది చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తాటిపూడిలో జరిగిన రిసెప్షన్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై తిరిగి వస్తుండగా గింజేరు కూడలిలో డివైడర్‌ను ఢకొీనడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న జాగరపు వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

➡️