రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Nov 28,2024 21:51

ప్రజాశక్తి – సీతంపేట :  జన జాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట గిరిజన సంస్తృతి పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా, ఇతర పోటీల్లో స్తానిక ఐటిడిఎ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరిని పిఒ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి గురువారం తన ఛాంబర్లో అభినందించారు. అనంతరం పిఒ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను సీతంపేట, ఐటిడిఎ విద్యార్థులు కైవసం చేసుకొన్నారు. కార్యక్రమంలో ఎపిఒ జి.చిన్నబాబు, ఎఒ సునీల్‌, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌ దయానందం, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

➡️