ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో అవసరమున్నచోట్ల విద్యార్థులకు బడి బస్సులు నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు బుధవారం మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసి డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్ ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కె.రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు బడి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా బడి బస్సులు సంఖ్య పెంచాలని, టైమ్‌కు పాఠశాలలకు, కళాశాలలకు చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న విధంగా విజయనగరం నుంచి రణస్థలం వరకు, విజయనగరం నుంచి సతివాడ వరకు, విజయనగరం నుంచి కుమిలి వరకు బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు శిరీష , సోమేష్ , పట్టణ కమిటీ సభ్యులు శివ , గుణ, జయ, లక్ష్మి, పాల్గొన్నారు.
