ఉద్యోగాలకు విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి-అద్దంకి : ఒంగోలులోని శ్రీహర్షిణి కాలేజీ మెయిన్‌ బ్రాంచిలో ఇటీవల క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అద్దంకి బ్రాంచి చెందిన ఆరుగురు విద్యార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొని చెన్నైకి చెందిన వెబ్‌ కంపెనీ రూ.2.50 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సంస్థ సిఇఒ నారాయణ్‌ మిశ్రా నుంచి ఆఫర్‌ లెటర్లు అందుకున్నారు ఈ ఆఫర్‌ లెటర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బుధవారం అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ పోపూరి నరసింహారావు సిబ్బంది అభినందించారు.

➡️