వేసవి విజ్ఞాన తరగతులలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి – కాకినాడ : స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయం వేసవి విజ్ఞాన తరగతులు కార్యక్రమం మంగళవారం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులచే ఉదయం 8 గంటల నుండి 8:30 గంటల వరకు పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించడం, 8:30 గంటల నుండి 9:20 గంటల వరకు డి ఆర్ డి ఏ సిబ్బంది ఎం సత్య బాల విద్యార్థిని విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, మేధాశక్తి పెంచే రకరకాల ఆటలు ఆడించి విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యతను పెంచే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు విశ్రాంత ఉపాధ్యాయులు బి సూర్యనారాయణ మాస్టారు విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్, స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు విద్యార్థిని విద్యార్థులచే కథలు, పద్యాలు, పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి ఎల్ ఎన్ ఎస్ వి ప్రసాద్, జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉప గ్రంథాలయ అధికారి కిషోర్, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది ఎస్. రాజు, ఏవీఎస్ నాగేంద్ర కుమార్, టి వీర్రాజు, వి. అరుణ, కె ప్రియదర్శిని స్థానిక పాఠశాలల నుండి 61 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️