ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్‌టిఆర్) : ఇటీవల తిరువూరులో జరిగిన ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల్లో నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయికి తమ పాఠశాల విద్యార్థినులు కో,కో క్రీడకు ఎంపికైనట్లు నెమలి జడ్పీ హైస్కూల్ పి ఈ టి మౌనిక తెలిపారు. అండర్ 17 విభాగంలో టీ కీర్తి, ఈ గంగోత్రి, కే నందినీలు ఎంపికయ్యారు. ఈ విషయమై క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రం అభినందించారు.