ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం : గండి గురుకుల కళాశాలలో జరిగిన జోనల్ లెవెల్ క్రీడా పోటీలలో బ్రహ్మంగారిమఠం గురుకుల కళాశాల విద్యార్థులు హై జంప్, క్యారమ్స్ లో మొదటి స్థానంలో.. ఖో ఖో ద్వితీయ స్థానంలో పతకాలు సాధించారు. ఈ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ కె హరి అభినందించారు. ఉపాధ్యాయులు మున్నెల్లి గురురత్నం, బొల్లు రామ్మోహన్. ఏలూరు జిల్లా పెదవేగి గురుకుల కళాశాలలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనబోతున్నారని ఆయా స్కూల్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మున్నెల్లి గురురత్నం, బొల్లు రామ్మోహన్ వీరికి కృషి చేసిన పిడి రాహుల్ పీటి మహేష్ లకు అభినందనలు తెలిపారు.